Tuesday, March 26, 2024

థాంక్యూ….ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఖరారు?

అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను జూన్ చివరిలో కానీ జూలై మొదటి వారంలో కానీ విడుదల చేయాలని అనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాలో చైతు సరసన రాశికన్నా నటిస్తుండగా…. దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా తీసిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement