Thursday, April 25, 2024

నేను చనిపోయానని ప్రచారం చేసినవారికి ధన్యవాదాలు…షకీలా

సీనియర్ నటి షకీలా చనిపోయినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే అవన్నీ ఒట్టి రూమర్స్ అని కొట్టిపారేస్తూ ఒక వీడియో ని రిలీజ్ చేశారు షకీలా. అంతేకాకుండా ఈ పుకార్లను సృష్టిస్తున్న వ్యక్తికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. నేను ఇక లేనని వార్తలు వచ్చినట్టు నాకు తెలిసింది. నిజానికి అలాంటిదేమీ లేదు నా ముఖంలో పెద్ద చిరునవ్వుతో నేను నిజంగా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాను.

నా కోసం శ్రద్ధ తీసుకున్న వ్యక్తులకు ధన్యవాదాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరో నా గురించి చెడు వార్తలను వైరల్ చేశారు. దీంతో నాకు చాలా మెసేజెస్, కాల్స్ వచ్చాయి. ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేసిన వారికి ధన్యవాదాలు ఎందుకంటే ప్రేక్షకులు, ప్రజలు అందరు నా గురించి ఆలోచించేలా చేసినందుకు… అంటూ చెప్పుకొచ్చారు షకీలా.

Advertisement

తాజా వార్తలు

Advertisement