Thursday, April 18, 2024

మెగా అభిమానులకు ధన్యవాదాలు…రామ్ చరణ్

కరోనా కష్టకాలంలో ప్రజలకు సహాయం చేయడానికి ఎంతో మంది సినీ స్టార్స్ ముందుకు వస్తున్నారు. అయితే అందులో భాగంగానే మెగా అభిమానులు కూడా కరోనా సమయంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు అండగా నిలిచారు. ఇదే విషయాన్ని చెబుతూ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు రామ్ చరణ్. అభిమానులు… ఈ కరోనా మహమ్మారి సమయంలో కష్టపడి పనిచేస్తున్న సమాజ సేవ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సామాన్యుడికి సహాయం చేయడం, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంలో మీరు ఎంతో అంకితభావంతో పని చేశారు. ఎన్నో వ్యయప్రయాసలను ఓర్చి అందరికీ సహాయం చేసిన మీ అందరికీ నా శుభాభినందనలు మీ అందరి అంకితభావానికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement