Saturday, April 20, 2024

ప్రోమోతో అదరగొట్టిన థమన్..

ప్రస్తుతం థమన్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతున్నాడు. స్టార్ హీరోలు తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే అమెరికాలో గతంలో మణిశర్మ, దేవిశ్రీప్రసాద్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రత్యేక షోలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు థమన్ కూడా అమెరికాలో షోలు మొదలు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇక కరోనా కారణంగా అన్ని ఈవెంట్లు కూడా మరుగున పడ్డాయి. అమెరికాలో మాత్రం కరోనా ప్రభావం పూర్తిస్థాయిలో తగ్గిపోయింది.

అయితే తాజా గా ఈ షో కు సంబంధించిన ప్రోమో ను అల్లు అర్జున్ రిలీజ్ చేశారు. ఓ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ ప్రోమో వీడియో అద్భుతంగా వచ్చింది . అయితే దీనివెనుక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఉన్నారట. ప్రోమో కథకు సంబంధించి ఐడియా దగ్గరనుండి మేకింగ్ వరకు త్రివిక్రమ్ సూచనలు సలహాలు ఉన్నాయట. ఇక ప్రోమోలో శివమణి డ్రమ్స్, సింగర్ హారిక.. థమన్ పాటు తన టీం కనిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement