Thursday, April 18, 2024

బీ రెడీ: థియేటర్లకు అమ్మ వస్తోంది!

కరోనా కేసులు క్రమంగా తగ్గడంతో థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే పలు చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు కూడా క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఎంజీఆర్‌గా అరవిందస్వామి అలరించనున్నారు. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న తమిళ, తెలుగు భాషల్లో థియేటర్‌లో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్ లో మూవీ టీం బీజీ అయ్యారు.

జయలలిత తమిళ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా ఎలా ఎదిగారు? ఎంజీఆర్‌కు ఎలా దగ్గరయ్యారు? తమిళ రాజకీయాల్లో ప్రవేశించి ఏవిధంగా చక్రం తిప్పారన్న విషయాలను ఏఎల్‌ విజయ్‌ చూపించనున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్‌ రచనా సహకారం అందించారు. విష్ణు వర్దన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌, బృందా ప్రసాద్‌లు నిర్మించారు. ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement