Thursday, April 25, 2024

అఖండ టీజర్ పై అల్లుడు లోకేష్ ఏమన్నాడో తెలుసా ?

బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు అఖండ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దాంతోపాటు టీజర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ టీజర్ లో అఖండ లుక్ లో బాలకృష్ణ అదరగొట్టారు. పవర్ ఫుల్ లుక్ లో బాలయ్య దర్శనమిచ్చారు. కాగా టీజర్ పై బాలకృష్ణ అల్లుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.

అఖండ టీజర్ చూసి ఎంతో థ్రిల్ అయ్యానని…బాలా మామయ్య ఉగ్రరూపం చూపించాడని లోకేష్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఖచ్చితంగా తిరుగులేని బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. హీరో శ్రీకాంత్ విలన్ గా కనిపించనున్నాడు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement