Wednesday, April 17, 2024

పుష్ప లో తరుణ్ ? ఆన్ స్క్రీన్ కాదట !!

పుష్ప సినిమాతో తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు సినీ అభిమానులు. అయితే ఆన్ స్క్రీన్ లో తరుణ్ కనిపించటం లేదట. మరి ఎలా అనుకుంటున్నారా… పుష్ప సినిమాలో విలన్ అయిన ఫహాద్ ఫజిల్ కు డబ్బింగ్ చెప్పబోతున్నారట తరుణ్. ఇటీవల ఆహా ఓటీటీ లో విడుదలైన అనుకోని అతిధి సినిమాలో నటుడు ఫహాద్ ఫజిల్ కు తరుణ్ డబ్బింగ్ చెప్పారట. అక్కడ ఫహాద్ నటనకు సరిగ్గా సరిపోయిందట.

దీంతో పుష్ప సినిమాలో కూడా తరుణ్ తోనే డబ్బింగ్ చెప్పించాలని సుకుమార్ భావిస్తున్నాడట. ఒకవేళ అన్నీ సెట్ అయితే తరుణ్ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పే అవకాశం ఉందట. కాగా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మీక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement