Monday, March 25, 2024

కొత్త పోస్టర్ పై తారక్ ఏమన్నాడో తెలుసా ?

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి కొమురం భీం లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమరం భీమ్ గా యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నాడు. అయితే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ను ఎన్టీఆర్ కూడా పోస్ట్ చేస్తూ… తన రోల్ గురించి కొన్ని విషయాలను చెప్పాడు.

తను పాత్రను అందరికీ పరిచయం చేస్తున్న చేస్తున్నందుకు సంతోషంగా ఉందని. అలాగే తాను చేస్తున్న ఈ కొమరం భీమ్ పాత్ర తన కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని కూడా చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే టీజర్ లో తారక్ పాత్రకు సంబంధించి పర్ఫార్మెన్స్ చూసాము. మరి ఈ సినిమాలో పూర్తిస్థాయిలో ఏ విధం గా తారక్ కనిపించబోతున్నాడో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement