Wednesday, April 24, 2024

అల్లుఅర్జున్ లైనప్ లో తమిళ స్టార్ డైరెక్టర్ ఇంకా ఉన్నాడట!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఫ్యాన్స్ లో చర్చనీయాంశంగా మారింది.

అయితే అందులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ పేరు ముఖ్యంగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం తెలియ రావట్లేదు. మొదట ఈ ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ కాంబినేషన్ లో సినిమా కచ్చితంగా ఉంటుందట. పుష్ప, ఐకాన్ తర్వాత బన్నీ మురుగుదాస్ తోనే సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement