Thursday, April 18, 2024

వంటల ప్రోగ్రామ్ కు హోస్ట్ గా తమన్నా ?

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో కోట్లాదిమంది అభిమానుల మన్ననలు పొందింది తమన్నా. ఇక ఇటీవలే తమన్నా నటించిన లెవెంత్ అవర్, నవంబర్ స్టోరీస్ వెబ్ సిరీస్ మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నాయి. ఇక తాజాగా టీవీ హోస్ట్ గా కూడా చేయటానికి రెడీ అవుతుంది తమన్నా. జెమినీ టీవీలో ఒక కుకింగ్ షో కు హోస్ట్ గా మారబోతున్న ట్లు సమాచారం.

మాస్టర్ చెఫ్ షో కి ఏ మాత్రం తీసిపోకుండా ఈ షో ఉంటుందట. అలాగే తమన్నాకి ఈ షో కోసం భారీ రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారట. ఇక సినిమాల విషయానికొస్తే తమన్నా సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. అలాగే నితిన్ మాస్ట్రో,ఎఫ్3 సినిమాలో కూడా తమన్నా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement