Monday, April 15, 2024

తన పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టిన మిల్కీ బ్యూటీ

క్రికెటర్స్ ,హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్స్ సినీ హీరోయిన్స్ ని పెళ్లి కూడా చేసుకున్నారు. కాగా తాజాగా తమన్నాకి కూడా ప్రముఖ క్రికెటర్ తో లింక్ పెట్టారు నెటిజన్లు. అసలు విషయం ఏంటంటే ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది తమన్నా. ఆ ఫోటోలో తమన్నా తో పాటు విరాట్ కోహ్లీ కూడా కనిపించాడు. లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో ఓ ప్రైవేట్ ఫ్లైట్ లో ప్రయాణిస్తూ నా బ్రేక్ ఫాస్ట్ ఇదే అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది.

తమన్నాతో ప్రైవేట్ ఫ్లైట్ లో విరాట్ కోహ్లీ ఉండటం ఏంటి అంటూ చర్చించడం మొదలు పెట్టారు నెటిజన్స్. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ కూడా క్రియేట్ చేశారు. దీనితో ఇదే విషయమై ఇంస్టాగ్రామ్ వేదికగా తమన్నా స్పందిస్తూ….తనతోపాటు ఆ ఫ్లైట్ లో ప్రయాణించిన ఇద్దరు నా మేకప్ మ్యాన్ లు. కోహ్లీ రూపంలో ఉన్న ఆ వ్యక్తి పేరు ఫ్లోరియన్ హురేల్ అని చెప్పి ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement