Wednesday, November 27, 2024

Tamannaah | అమృతం తాగిన అందం…

సుమారు 17 ఏళ్ల చిత్రం “చాంద్ సా రోషన్ చేహేరా” సినిమాతో సినీ ఇంస్ట్రీకి పరిచయమైంది తమన్నా. కేవలం 15 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా మారి ప్రస్తుతం కెరీర్‌లో సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో.. పలు సినిమాల్లో నటించి తమన్నా తన మార్క్ వేసుకుంది. నాగచైతన్య, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ, చిరంజీవి వంటి అగ్ర హీరోలకు జోడీగా నటించి తమన్నా మంచి విజయాలను అందుకుంది.

తమన్నా హీరోయిన్‌గానే కాకుండా పలు చిత్రాల్లో ఐటంసాంగ్స్‌లలో అలరించింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయింది ఈ ముద్దుగుమ్మ.

త‌మన్నా ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement