Friday, April 19, 2024

బోల్డ్ పాత్రల కోసం చూస్తున్న తమన్నా!!

మిల్కీ బ్యూటీ తమన్నా ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇటీవల తమన్నా నటించిన 11థ్ అవర్, నవంబర్ స్టోరీస్ వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అ రెండింటికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మరికొన్ని వెబ్ సిరీస్ లో నటించేందుకు తమన్నా రెడీ అవుతోంది. అంతేకాక బోల్డ్ పాత్రలపై కూడా ఫోకస్ పెడుతుందట.

అలాంటి కంటెంట్ వున్న వెబ్ సిరీస్ లు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుందట. ఇక సినిమాల విషయానికొస్తే తమన్నా ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ట్రో చిత్రంలో నటిస్తున్నారు. అలాగే గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటిమార్ సినిమాలో కూడా తమన్నా నటిస్తుంది. ఇందులో కబడ్డీ కోచ్ గా కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement