Friday, April 19, 2024

మహేష్ బర్త్ డే బ్లాస్టర్ పై తమన్ రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభించగా… ఆగస్టు 9 సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ బర్తడే బ్లాస్టర్ అనే వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే తాజాగా దీనిపై ఓ ట్వీట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. జస్ట్… సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ ఫైనల్ చూశాను. బూమ్… ది ఎర్లీ మార్నింగ్ అడ్రినలిన్ రష్ క్రషుడ్ మై మైండ్… మహేష్ బాబు ట్విట్టర్ లో సునామీ సృష్టించబోతున్నారు. సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ ప్లస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2022 సంక్రాంతి సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement