Thursday, April 25, 2024

పుష్ప కి కష్టాలు… డేట్ మిస్ అవుతుందా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ స్మగ్లర్ పుష్ప రాజ్ కనిపించబోతున్నారు. కాగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అనుకున్న సమయానికి సినిమా రావడం కష్టమే అని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అధిక భాగం షూటింగ్ అడవుల్లో చేయాల్సి ఉంది. ఇప్పటికే తూర్పు గోదావరి మారేడుమిల్లి అరణ్య ప్రాంతంలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం తమిళనాడులోని టెక్ కాశీ ప్రాంతంలో షూట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ ముందుగానే అనౌన్స్ చేయడంతో శరవేగంగా షూటింగ్ జరపాల్సి వస్తుందట. దీంతో ఒత్తిడి పెరిగిందట. కానీ నిజానికి షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ఉండటం, మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతుండడం ఇబ్బందిగా మారిందట. మొత్తానికి అనుకున్న సమయానికి సినిమా రాకపోవచ్చని తెలుస్తుంది. మరి సుక్కు ఈ విషయంలో వెనక్కి తగ్గుతాడా లేక షూటింగ్ స్పీడ్ గా పూర్తి చేస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement