Thursday, April 25, 2024

సూర్య బర్త్ డే స్పెషల్….ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది !!

డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంటూ ఉంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవలే ఆకాశం నీ హద్దురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. అదే జోష్ తో ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో వెట్రిమారన్ దర్శకత్వంలో వాడి వాసల్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ ను శుక్రవారం లాంచ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే తన 40వ చిత్రం పాండిరాజ్ తో చేయబోతున్నాడు సూర్య. పక్క యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే జూలై 23న సూర్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement