Thursday, April 25, 2024

సర్జరీ విజయవంతం…ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవలే గాయపడిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ సమయంలో ఫ్లోర్ పైనుంచి జారిపడ్డ ప్రకాష్ రాజ్… చిన్న ఫ్యాక్చర్ అయిందని హైదరాబాదులోని డాక్టర్ గురువారెడ్డి తో సర్జరీ చేయించుకునేందుకు వస్తున్నానని ట్వీట్ చేశారు. కాగా తాజాగా ఆయన ఆసుపత్రి నుంచి మరో పోస్ట్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

తనకు సర్జరీ చేసిన డాక్టర్ గురువారెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ… సర్జరీ విజయవంతమైందని చెప్పారు. తను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలని త్వరలోనే మళ్ళీ యాక్షన్ లోకి వస్తాను అని అన్నారు. ది డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. ఆసుపత్రి బెడ్ మీద నవ్వుతూ దిగిన ఫోటో ని పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement