Friday, April 19, 2024

కోల్ కత్తాలో సూపర్ స్టార్ @ అన్నాత్తే

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత షెడ్యూల్ హైదరాబాద్ లో జరగా ఇప్పుడు తాజా షెడ్యూల్ కోల్ కత్తా లో జరగబోతోంది. అయితే ఈ షెడ్యూల్ ఈ సినిమాకు చివరి షెడ్యూల్. అయితే ఈ నేపథ్యంలోనే షూటింగ్ నిమిత్తం సూపర్ స్టార్ రజనీకాంత్ కలకత్తాలో అడుగుపెట్టారు.

ఇప్పటికే నటీనటులతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా కోల్ కత్తా కి చేరుకున్నారు. ఇక ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 4న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement