Friday, April 19, 2024

వకీల్ సాబ్ కు సూపర్ స్టార్ విషెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు వకీల్ సాబ్ సినిమాపై స్పందించారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలతో ముంచెత్తారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉందని… ప్రకాష్ రాజు లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారని మహేష్ అన్నారు. ముఖ్యంగా అంజలి, నివేదాథామస్, అనన్య నా మనసుకు హత్తుకుందని చెప్పుకొచ్చారు.

అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ అంటూ ప్రశంసించారు. చిత్ర యూనిట్ కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. ఇక పింక్ రీమేక్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు బోనికపూర్ సంయుక్తంగా నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement