Wednesday, March 27, 2024

కేజీఎఫ్2 లో సూపర్ డూపర్ ఐటమ్ సాంగ్ ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కే జి ఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కేజిఎఫ్ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. మన సౌత్ వెర్షన్ కి ఒక ఐటమ్ సాంగ్ బాలీవుడ్ వెర్షన్ కి మరో ఐటెం సాంగ్ ని డిజైన్ చేస్తున్నారట. గతంలో కూడా చాప్టర్ 1కి ఇలానే ఐటెం సాంగ్ పెట్టారు. అయితే ఇప్పుడు ఐటమ్ సాంగ్ కోసం జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరితో ఈ ఐటమ్ సాంగ్ ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement