Tuesday, April 23, 2024

సూప‌ర్ కాంబినేష‌న్.. హీరోలుగా రానా.. దుల్క‌ర్ స‌ల్మాన్

సూప‌ర్ కాంబినేష‌న్ సెట్ కాబోతుంది. హీరోలు రానా.. దుల్క‌ర్ స‌ల్మాన్ క‌లిసి కలిసి తెలుగు-తమిళ సినిమా చేయబోతున్నారు.అయితే ఇది మల్టీ స్టారర్ చిత్రం కాద‌ట‌.. ఈ చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరించనున్నారు. దుల్కర్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమమైన ఆయన ఆ తర్వాత ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాలతో టాలీవుడ్ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో తన కొత్త సినిమాను ప్రకటించారు. ఇప్పుడు రానా నిర్మాణంలోని ‘స్పిరిట్’ మీడియా బ్యానర్ లో మరోచిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఓ యువ సాంకేతిక నిపుణుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని, త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన చేయ‌నున్నార‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement