Thursday, March 28, 2024

విశాల్ కు విల‌న్ గా సునీల్…

కమెడియన్ గా, హీరోగా ప్రేక్షకులను మెప్పించిన సునీల్. పుష్ప సినిమాలో విలన్ గా నటించి వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటున్నాడు. తమిళ హీరో విశాల్ నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ విషయంపై మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ సునీల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కాగా, రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ సినిమాలో కూడా మెయిన్ విలన్ గా సునీల్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement