Wednesday, March 27, 2024

సందీప్ కిష‌న్ మైఖేల్ మూవీ ట్రైల‌ర్

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైఖేల్’. రంజిత్ జైకోడి దర్శకుడు. విజయ్ సేతుపతి వరుణ్ సందేష్ గౌతమ్ మీనన్ అనసూయ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. దివ్యాంన్ష కౌశిక్ హీరోయిన్ కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పీ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ లపై భరత్ చౌదరి పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ తో పాటు రొమాన్స్ డ్రామా.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్ర ట్రైలర్ ని నేడు విడుదల చేశారు. తెలుగులో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేయగా తమిళంలో జయం రవి అనిరుధ్ రవిచంద్రన్ విడుదల చేశారు. మలయాళంలో క్రేజీ హీరో నవీన్ పాలీ రిలీజ్ చేశాడు. టీజర్ తో ఆసక్తిని రేకెత్తించి అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ ట్రైలర్ తో కూడా ఆ అంచనాల్ని మరింతగా పెంచేసింది. కాక‌పోతే హింస ఎక్కువుగా ఉంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement