Tuesday, March 26, 2024

సుకుమార్ నెక్స్ట్ సినిమాపై మరికొద్ది రోజుల్లో అనౌన్స్ మెంట్ !!

డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో లో కుమార్ తన తర్వాతి సినిమాను విజయ్ దేవరకొండ తో చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అందరూ బావిస్తున్నారు. కాగా దీనిపై అనౌన్స్మెంట్ కూడా మరికొద్ది రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement