Thursday, April 25, 2024

సుకుమార్ మైండ్ లో రెండు ఆలోచనలు ?

అల్లు అర్జున్ హీరోగా క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళం స్టార్ నటుడు ఫహద్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కాగా ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే రెండవ పార్ట్ కు వేరొక కొత్త టైటిల్ ను ఆలోచిస్తున్నారట సుకుమార్. అలాగే విలన్ విషయంలో కూడా ఆలోచన చేస్తున్నాడట సుకుమార్. ఎనిమిది మంది విలన్స్ ఉన్న ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ఫహాద్ ను ఎంచుకున్నారు. అయితే ఆ పాత్ర ఫస్ట్ పార్ట్ లోనే క్లోజ్ అవుతుందట. కాగా సెకండ్ పార్ట్ కోసం మరో పవర్ ఫుల్ విలన్ వెతికే పనిలో పడ్డారట సుకుమార్. బన్నీ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement