Tuesday, March 26, 2024

డాక్టర్ యశోదగా సుహాసిని

సీనియర్ నటి సుహాసిని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న సుహాసిని కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసుకుంటూ సినిమాలను చేస్తూ వస్తోంది. గతంలో రాఖీ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు మరో పవర్ ఫుల్ పాత్రలో బలమెవ్వడు సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాలో డాక్టర్ యశోద పాత్రలో నటిస్తున్నారు సుహాసిని. మెడికల్ మాఫియా కు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీగల ఒక డాక్టర్ పాత్రలో నటిస్తున్నారు. ధ్రువన్ కటకం, నియా త్రిపాఠి జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement