Monday, April 15, 2024

సుహాస్ ఫ్యామిలీ డ్రామా ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుహాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మజిలీ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు సుహాస్. ఇక ఇటీవల కలర్ ఫొటో సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. అయితే ఇప్పుడు మెహె‌ర్ తేజ్ దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోగా సుహాస్ నటిస్తున్నాడు.

థ్రిల్ల‌ర్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే ని మెహర్ తేజ్, ప్రశాంత్ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమా కు అజయ్ అండ్ సంజయ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన యూనిట్ ఫ్యామిలీ డ్రామా అనే టైటిల్ కు తగ్గట్టుగానే పోస్టర్ ను రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement