Friday, March 29, 2024

ప్రభాస్ తో సుధ కొంగర సినిమా ?

సినీ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ. అది స్టార్ హీరో తో లేడీ డైరెక్టర్స్ సినిమాలంటే మరీ తక్కువ. తెలుగులో నందినిరెడ్డి వరుస హిట్స్ కొడుతున్నా స్టార్ హీరోల డేట్స్ మాత్రం దొరకడం లేదు. మరోవైపు తమిళంలో సుధ కొంగరా వరుస హిట్స్ అందుకుంటున్నారు. ఇటీవల ఆకాశం నీ హద్దురా సినిమా తో మంచి హిట్ ను అందుకుంది సుధా. అయితే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుందట.

ఇప్పటికే సుధ కొంగర స్టోరీ లైన్ ను ప్రభాస్ కు చెప్పిందట. ఆ లైన్ నచ్చి పూర్తి స్క్రిప్ట్ చెప్పాలని కోరాడట ప్రభాస్. అప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని ప్రభాస్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అదే పనిలో సుధ ఉన్నారట. అయితే ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుషుష్, రాధేశ్యామ్,సలార్ సినిమాలు చేస్తున్నాడు. తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అవి అన్ని అయిన తర్వాత అంటే ఎలా లేదన్న 2023 తరువాతే సుధ కొంగర సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement