Friday, April 26, 2024

కోలీవుడ్ బ్యానర్ లో స్టైలిష్ స్టార్ సినిమా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి.

తాజాగా బన్నీ లైనప్ లో మరో సినిమా చేరినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ థాను బ్యానర్ లో బన్నీ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ బ్యానర్ లో తుపాకీ, అసురన్, తెరి వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు ఓ తమిళ స్టార్ దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. మరి చూడాలి అందుకు సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement