Thursday, April 25, 2024

బన్నీ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి..?

అల్లు అర్జున్ పుష్ప మూవీతో బిజీగా ఉన్నాడు. పుష్ప తరువాత కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ నటించనున్నాడు. అయితే ఈ లోపు మరో సినిమా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపుడి డైరెక్షన్ ఓ మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో రాజమౌళి.. కొరటాల తర్వాత ఇంతవరకూ అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడికి పేరుంది. ఆయన తన కెరియర్ ను ఓ మాదిరి హీరోలతోనే మొదలుపెట్టేసి, ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళుతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఇటీవలే అల్లు అర్జున్ ను కలిసి కథ కూడా వినిపించాడట అనిల్ రావిపూడి…దీనికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పుష్ప తరువాత ఆయన చేసే నెక్స్ట్ ప్రాజెక్టు ఇదేనని అంటున్నారు. ఈ కథ కూడా నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గానే సాగుతుందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. చూడాలి మరీ ఈ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతూ అదిరిపోతుందంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement