Friday, April 19, 2024

జాతి రత్నాలుపై స్టైలిష్ స్టార్ రియాక్షన్ ఏంటో తెలుసా ?

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రలో మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాతిరత్నాలు. ఈ చిత్రం మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే సినిమా చూసిన కొంత మంది సినీ ప్రముఖులు దర్శకుడిపై, హీరో నవీన్పొలిశెట్టి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ జాతిరత్నాలు సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ట్విట్టర్ ద్వారా స్పందించిన అల్లు అర్జున్ లాస్ట్ నైట్ జాతిరత్నాలు సినిమా చూశాను. ఈ మధ్య కాలంలో నేను ఇంతగా ఎప్పుడూ నవ్వలేదు. నవీన్ పొలిశెట్టి నటన అద్భుతం. ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ఇద్దరూ బాగా చేశారు. చిత్ర దర్శకుడు అనుదీప్ పై గౌరవం పెరిగింది. అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement