Thursday, March 28, 2024

సోనూసూద్ కోసం….స్టార్ డైరెక్టర్ ?

కరోనా సమయంలో ఎంతోమంది వలస కూలీల కు సహాయం చేసి రియల్ హీరో అయ్యాడు సోనూసూద్. ఆలయాలు సైతం కడుతున్నారంటే జనాల హృదయాలను సోనూ ఏ స్థాయిలో గెలుచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. కరోనా మొదటి వేవ్ సమయం నుంచి కూడా సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేస్తున్నాడు. కాగా సోను సూద్ కు ప్రత్యేకంగా ఓ అభిమాన బృందమే తయారయింది.

హీరోలకు లేని ఫాలోయింగ్ సైతం వచ్చింది. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ కు సినిమాలో హీరోగా ఆఫర్లు పెరుగుతున్నాయట. ఇప్పటికే కొంతమంది దర్శకులు ఆయన కోసం కథలు కూడా తయారు చేస్తున్నారట. కాగా తాజాగా ఓ పెద్ద డైరెక్టర్ కు సోనూసూద్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. అయితే ఆ డైరెక్టర్ ఎవరు సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement