Saturday, April 20, 2024

వార‌స‌త్వంతో స్టాలిన్ సీఎం కాలేదు.. విజ‌య్ సేతుప‌తి

సినిమా న‌టీ న‌టులు రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌డం మామూలే..కొంద‌రు స‌క్సెస్ అయితే..మ‌రికొంద‌రు పాలిటిక్స్ లో ఇమ‌డ‌లేక బ‌య‌టికి వ‌చ్చిన వారు ఉన్నారు. కాగా ఇప్పుడు త‌మిళ‌నాట ఓ వార్త వైర‌ల్ గా మారింది. త‌మిళ స్టార్ న‌టుడు విజయ్ సేతుపతి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని, సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై విజయ్ సేతుపతి స్పందిస్తూ… తనకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉందన్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని తెలిపారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 70వ పుట్టినరోజును పురస్కరించుకుని చెన్నైలోని తేనాంపేటలో ‘స్టాలిన్ 70’ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను విజయ్ సేతుపతి తిలకించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తన రాజకీయ ప్రవేశంపై ఆయన స్పందించారు. ఇదే సమయంలో స్టాలిన్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. వారసత్వంతో స్టాలిన్ సీఎం కాలేదని… కఠోరశ్రమతో సీఎం పదవిని చేపట్టారని విజ‌య్ సేతుప‌తి ప్ర‌శంస‌లు కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement