Friday, March 29, 2024

ఓటీటీలో ఆర్ఆర్ఆర్.. డేట్ ఫిక్స్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్. ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ డ్రామాగా విడుద‌లై ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.1100 కోట్ల‌ను క‌లెక్ట్ చేసి రికార్డుల‌ను క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నంద‌మూరి ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూశారు.

తాజాగా RRR ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5లో మే 20న విడుద‌ల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అందుబాటులో ఉంటుంది, హిందీ వెర్షన్ త్వరలో వస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేసింది జీ5.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement