Friday, March 29, 2024

త్రివిక్ర‌మ్.. మ‌హేశ్ మూవీ.. అప్ డేట్ ఇచ్చిన మేక‌ర్స్

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ .. స్టార్ హీరో మ‌హేశ్ బాబు కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం అప్ డేట్ వ‌చ్చింది.యాక్షన్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్.చిన‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం గ్లింప్ప్ ని
సూపర్‌స్టార్‌ కృష్ణ బర్త్‌డే సందర్భంగా బుధవారం రిలీజ్‌ కానుంది. మోసగాళ్లకు మోసగాడు రీ-రిలీజ్‌ అయ్యే థియేటర్‌లలో ఈ గ్లింప్స్‌ రిలీజ్‌ కానుంది. కాగా తాజాగా చిత్రబృందం గ్లింప్స్‌ రిలీజయ్యే టైమ్‌ను వెల్లడించింది. బుధవారం సాయంత్రం 6.03 గంటలకు ఈ సినిమా గ్లింప్స్‌ను ఫ్యాన్స్‌ రివీల్‌ చేస్తారని మేకర్స్‌ తెలిపారు. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం అనే రెండు టైటిల్స్‌ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. దాదాపుగా ఈ రెండిట్లో ఒకటి కన్ఫర్మ్‌ అని టాక్‌. ఇక గురూజీ ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన అ సెంటిమెంట్‌ ప్రకారం అమరావతి అని ఫిక్సయ్యాడట. అయితే మాస్‌ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో మహేష్‌ మాత్రం గుంటూరు కారం టైటిల్‌ వైపే మొగ్గుచూపుతున్నాడు. మరీ ఈ రెండింట్లో ఏది ఫైనల్‌ అవుతుందో తెలియాలంటే ఒక రోజు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement