Friday, March 29, 2024

“#SSMB28 ఆరంభం” మ‌హేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ బిహైండ్ ది స్క్రీన్.. వీడియో ఇదిగో

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రిన్స్ మ‌హేష్​బాబు కాంబోలో వ‌స్తున్న మూడో సినిమా #SSMB 28 వ‌ర్కింగ్ టైటిల్ తో ఇవ్వాల (సోమ‌వారం) షూటింగ్ ప్రారంభించారు. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారు. ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో మేకర్స్ షూట్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్ నెల రోజుల పాటు కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ మూవీలో మహేష్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు.

కాగా, కొద్ది సేప‌టి క్రితం లొకేష‌న్ లో జ‌రుగుతున్న కొన్ని తెర వెనుక స‌న్నివేశాల‌తో అభిమానుల కోసం ఒక్క వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. అతడు & ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేష్ క‌లిసి చేస్తున్న మూడ‌వ సినిమా SSMB 28. ఇక ఈ సిన‌మాలో పూజా హెగ్డే ఫీమేయిల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. అలా పూర్తైతే 2023 ఏప్రిల్ 28 నాటికి తెలుగు, తమిళం, మలయాళం & హిందీలలో ఈ సినిమా విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement