Thursday, March 28, 2024

శ్రీరామ నవమి స్పెషల్… వరుడు కావలెను పోస్టర్ రిలీజ్

హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. ఇటీవల అశ్వద్ధామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ప్రస్తుతం లక్ష్య తోపాటు వరుడు కావలెను సినిమా చేస్తున్నాడు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా వరుడు కావలెను చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్ లో హీరో నాగ శౌర్యను అలా గోడపై కూర్చున్నట్లు చూపించాడు దర్శకుడు. బాక్ గ్రౌండ్ లో శ్రీ రాముడు సీత దేవి కళ్యాణం జరుగుతుంది. ఇక ఈ పోస్టర్ చూస్తేనే ఈ సినిమా నేపథ్యం అర్థమైపోతుంది. ఇక ఈ సినిమాతో లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానున్నారు. కాగా రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement