Wednesday, March 27, 2024

జోష్‌మీదున్న శ్రీ‌లీల‌.. మ‌హేశ్‌బాబు మూవీలో క‌నిపించ‌నున్న బ్యూటీ క్వీన్‌

పెళ్లి సందడి విజయంతో రోషన్‌, శ్రీలీల ఇద్దరికీ టాలీవుడ్ లో అదృష్టం తలుపులు తెరిచింది. అయితే, రోషన్ కాస్త స్లో అవుతూ సరైన ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదే తరుణంలో శ్రీలీల మరో భారీ ప్రాజెక్ట్ లో చాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్ వస్తున్న #SSMB28 ప్రాజెక్ట్‌లో ఆమె సూపర్‌స్టార్ మహేష్ బాబుతో పక్కన కనిపించనుంది.

SSMB28 కోసం మహేష్ సరసన పూజా హెగ్డే ఇప్పటికే ప్రధాన కథానాయికగా సంతకం చేసింది. అయితే ఈ సినిమాలో శ్రీలీల రెండో హీరోయిన్ గా నటించ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాక DJ టిల్లు సీక్వెల్‌లో భాగం కావాల్సి ఉంది.. కానీ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది శ్రీలీల. డీజే టిల్లు 2లో ఇప్పుడు శ్రీలీల స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చింది.

SSMB28 కాకుండా, త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన రవితేజ ధమాకాలో ఈ యువ నటి హీరోయిన్ గా కనిపించనుంది. ధమాకా డిసెంబర్ 23న విడుదల కానుంది. బాలకృష్ణ- అనిల్ రావిపూడి తదుపరి చిత్రంలోనూ శ్రీ‌లీల కీలక పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. బాలయ్య కూతురి పాత్రలో ఆమె నటించనున్నట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement