Friday, September 22, 2023

శ్రీకాంత్ అడ్డాల కొత్త చిత్రం.. వైర‌ల్ గా పోస్ట‌ర్

అఖండ చిత్రంతో సూప‌ర్ హిట్ట్ ని అందుకున్నారు హీరో బాల‌కృష్ణ‌. ఈ సినిమాతో రికార్డ్స్ నెల‌కొల్పారు. కాగా ఈ సినిమా సీక్వెల్ కి తాను సిద్ధంగా ఉన్నానని అఖండ మూవీ రిలీజ్ టైంలోనే చెప్పారు. నిర్మాతనే మిర్యాల రవీందర్ రెడ్డి . ఆ సినిమాని తెర‌కెక్కించేందుకు ఇంకా సమయం ఉండటంతో, మరో భారీ బడ్జెట్ సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నారు. ఇంతవరకూ ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. జూన్ 2వ తేదీన టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను 11:39 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఫ్యామిలీ ఎమోషన్స్ ను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు శ్రీకాంత్ అడ్డాలకి ఉంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో చేయనున్న సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.ఇప్పుడీ పోస్ట‌ర్ వైర‌ల్ గా మారింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement