Thursday, April 25, 2024

ఎస్ ఆర్ కళ్యాణమండపం ట్రైలర్ రిలీజ్

రాజావారు రాణి గారు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో కిరణ్ కు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం కిరణ్ శ్రీధర్ గాదే దర్శకత్వంలో ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్… విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో సాయి కుమార్ తో ఎమోషన్ సీన్స్, అలాగే ప్రియాంక తో కామెడీ ఇలా అన్ని కోణాల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ను కట్ చేశారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మాములుగా ముందుగా చెప్పినట్టుగానే థియేటర్ కి వచ్చే ఆడియన్స్ కి ఈ సినిమా అన్ని రకాల నచ్చేవిధంగా కనిపిస్తోంది. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 6న రిలీజ్ కాబోతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement