Wednesday, April 24, 2024

బాలీవుడ్ స్టార్స్ కన్నా రెమ్యూనరేషన్ లో సౌత్ స్టార్స్ దే పై చేయి?

బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అదేవిధంగా రెమ్యూనరేషన్ విషయంలో కూడా తన మార్క్ పెంచాడు. అయితే ఒక్క తెలుగులోనే కాదు సౌత్ లో రెమ్యునరేషన్ పరంగా అగ్ర హీరోలు అందరూ మార్క్ ను పెంచుతూనే ఉన్నారు. బాలీవుడ్ లో అత్యధికంగా అమీర్ ఖాన్ 85 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడని సమాచారం. కాగా రోబో 2.o సినిమాకు రజిని ఆ మార్కును క్రాస్ చేశాడట. ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 65 కోట్ల వరకు ఓ సినిమాకి తీసుకుని హృతిక్ రోషన్ ను వెనక్కి నెత్తినట్టు కూడా తెలుస్తోంది.

అలాగే ప్రభాస్ విజయ్ దళపతి వీళ్లంతా కూడా బాలీవుడ్ స్టార్స్ ను మించే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారాట. నిజానికి హీరోల రెమ్యునరేషన్ ల గురించి ఎక్కడా కూడా స్పష్టంగా చెప్పరు. కానీ గత కొన్నాళ్లుగా చూసుకుంటే బాలీవుడ్ స్టార్ సినిమాలకన్నా సౌత్ స్టార్స్ కు సంబంధించిన సినిమాలు రికార్డులు కొనసాగిస్తున్నాయి.

బాలీవుడ్ సినిమాలు సౌత్ లో గట్టిగా వసూళ్లను రాణించలేక పోతున్నాయి. సౌత్ సినిమా మాత్రం బాలీవుడ్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement