Tuesday, April 23, 2024

నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి ‘సోనీ లివ్’ బంపర్ ఆఫర్

సోనీ లివ్ స్ట్రీమింగ్ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచపు నెంబర్ వన్ వెబ్ షో స్కామ్ 1992 వంటి అద్భుతమైన సిరీస్ ను స్ట్రీమ్ చేసిన సంస్థ సోనీ లివ్. కాగా ఈ సంస్థ ఇప్పుడు తెలుగు ఓటీటీ కంటెంట్ హెడ్‌గా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాతను నియమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి కి సోనీ లివ్ ఈ అవకాశాన్ని కల్పించింది. శ్రీధర్ రెడ్డి పై నమ్మకంతో ఆయనకు ఈ అవకాశాన్ని కల్పించారు.

ఈ సందర్భంగా సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ సోనీ లివ్ కంటెంట్ హెడ్ ఆశిష్ గోల్వాకర్ మాట్లాడుతూ… సోనీ లివ్ తెలుగు కంటెంట్ హెడ్‌గా మధుర శ్రీధర్ రెడ్డి గారు మాతో జాయిన్ అవ్వడం సంతోషంగా ఉంది. తనకున్న అనుభవంతో ప్రేక్షకులకు నచ్చే వైవిధ్యమైన కంటెంట్‌ను సోనీ లివ్‌కు తీసుకువస్తారని ఆశిస్తున్నాము. అన్ని వర్గాల వీక్షకులకు ఇష్టపడేలా సోనీ లివ్ ను శ్రీధర్ రెడ్డి డెవలప్ చేస్తారనే నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. మరి శ్రీధర్ రెడ్డి ఏ మేర ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement