Thursday, March 28, 2024

జ్యూస్ షాప్ లో ప్రత్యక్షమైన సోనూసూద్

రియల్ హీరో సోనూసూద్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. తెరమీద విలన్‌ పాత్రల్లో కనిపించే సోనూ సూద్‌లోని హీరోని.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచం.. సరికొత్తగా పరిచయం చేసుకుంది. సొంతూళ్లకు వెళ్లలేని వలసకూలీలు నడుస్తూ నడుస్తూ ప్రాణాలు కోల్పోవడం- అత్యంత భయంకరమైన సంక్షోభాన్ని కళ్లకు కట్టింది. ఎంతోమంది వలసకూలీలు, పేదలు, విద్యార్థులు సోనూ సూద్‌ను కదిలించారు. ఎందుకంటే తన అభిమానులు ప్రేమగా పిలిస్తే ఎంతదూరమైనా.. ఎక్కడికైనా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే బంజారా హిల్స్‌ రోడ్‌ నెంబర్‌-3లో రోడ్డు పక్కన ఉన్న జూస్‌ షాపుకు సడన్‌గా వచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు సోనూ. షాపు నడిపే వ్యక్తితో సరదాగా మాట్లాడిన సోనూ.. బత్తాయి జ్యూస్‌ను స్వయంగా చేసుకొని తాగారు. అంతేకాదు చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు సోనూ.

ఇది కూడా చదవండి: దేశంలో థర్డ్ ఫ్రంట్.. దీదీకి కేసీఆర్ మద్దుతు లేదా?

Advertisement

తాజా వార్తలు

Advertisement