Friday, April 19, 2024

సోనూసూద్ సాంగ్ వచ్చేస్తుంది..రెడీనా

కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న సోనూసూద్ కి ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అయితే ఇన్నాళ్లు సినిమాల్లో విలన్ గా వేషాలు వేసిన సోనూ ఇప్పుడు తన రూటు మర్చాడు. ఇప్పటి నుంచి పాజిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే అంతకంటే ముందే సోనూసుద్ ఓ ప్రైవేట్ మ్యూజిక్ వీడియో నటించనున్నాడు. ఇప్ప‌టికే పంజాబీ మ్యూజిక‌ల్ వీడియోలో న‌టించిన సోనూసూద్ తాజాగా మ‌రో మ్యూజిక్ వీడియో సినీ ల‌వ‌ర్స్ ను ప‌లుక‌రించేందుకు రెడీ అయ్యాడు. ఫ‌రాఖాన్ డైరెక్ష‌న్‌లో ‘ సాత్ క్యా నిభావోగే ’ మ్యూజిక్ వీడియోలో న‌టించారు సోనూసూద్‌. నిధి అగ‌ర్వాల్ సోనూ పక్క ఈ సాంగ్ లో నటించింది.

ఈ పాట‌ను పంజాబ్ లో చిత్రీక‌రించారు…ఈ ఇద్ద‌రు యాక్ట‌ర్లు సోష‌ల్ మీడియా ద్వారా మ్యూజిక్ వీడియో ఫ‌స్ట్ అఫీషియ‌ల్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. సాంగ్ టీజ‌ర్ ఆగ‌స్టు 5న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపారు. సోనూసూద్ చేతిలో తుపాకీతో స్టైలిష్ గా క‌నిపిస్తూ నిధిని ద‌గ్గ‌ర‌కు తీసుకున్న స్టిల్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్ సాత్ క్యా నిభావోగే పాట వ‌స్తోంది రెడీ గా ఉండండి అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు సోనూసూద్‌. ఫ‌రాఖాన్ తో ప‌నిచేయ‌డం ఎప్పుడూ అద్బుతంగా ఉంటుంది అని కామెంట్ పెట్టాడు సోనూసూద్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement