Thursday, April 18, 2024

సోనూసూద్ వార్నింగ్

కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ఇబ్బంది పడ్డ ఎంతోమంది పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించి రియల్ హీరో అయ్యాడు నటుడు సోనూసూద్. ఎంతోమంది పేదవారిని స్వగ్రామాలకు కు తరలించాడు. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు గా హెల్ప్ చేశాడు. అయితే సోనూసూద్ పౌండేషన్ ద్వారా ఎక్కడ ఎవరు సహాయం అడిగిన వారికి సాయం చేస్తూ వస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో నకిలీ ఫౌండేషన్ లింకులు చక్కెర్లు కొడుతున్నాయి. సోను సూద్ ఫౌండేషన్ అంటూ తమ నెంబర్లు ఇచ్చి విరాళాలను సెండ్ చేయమంటున్నారు కొందరు మోసగాళ్లు. ఈ విషయాన్ని తెలుసుకున్న సోనుసూద్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇలాంటి వాటిని నమ్మవద్దని ఇవి ఫేక్ అని పేర్కొన్నాడు. వార్నింగ్ అనే క్యాప్షన్ ఇస్తూ పోస్టు పెట్టారు సోనూ.

Advertisement

తాజా వార్తలు

Advertisement