Friday, March 29, 2024

సోనూసూద్ కూడా బెడ్ కోసం వెయిట్ చెయ్యాల్సి వస్తుందట !!

దేశంలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తిచెందుతుంది. అయితే కరోనా ఫస్ట్ వేవ్ లో ఎంతోమందికి సహాయం చేసి రియల్ హీరో అయ్యాడు నటుడు సోనూసూద్. సహాయం అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఆపద్బాంధవుడు అయ్యాడు. అయితే ఇప్పుడు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు సోనూసూద్. బెడ్స్, ఆక్సిజన్ దొరికేలా కృషి చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో కరోనా సెంటర్లలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తన అనుభవాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఢిల్లీ లో బెడ్ కోసం 11 గంటల సమయం పట్టిందని… ఉత్తరప్రదేశ్ లో 9 గంటల సమయం పట్టిందని… అయినప్పటికీ సహాయం అందించడం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు సోనూసూద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement