Friday, April 19, 2024

నాగ్ సరసన సోనాక్షి సిన్హా ?

నాగార్జున కెరీర్ లో సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఓ సినిమా తెరకెక్కబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే అవి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇక సోగ్గాడే చిన్నినాయన చిత్రం లో బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. అందుకే ఈ సీక్వెల్ సినిమాకు బంగార్రాజు అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమా ఈ సంవత్సరం పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ను తీసుకురావాలని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ భావిస్తున్నాడట. సోనాక్షి సిన్హా అయితే నాగ్ కు జోడిగా కొత్తగా ఉంటుందని ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరుగుతున్నాయట. ఇక నిజానికి ఈ సినిమా షూటింగ్ జూన్ జూలైలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement