Wednesday, April 17, 2024

సూర్య చేతులమీదుగా సన్ ఆఫ్ ఇండియా టీజర్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కాగా ఈ చిత్రం పలు నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేతులమీదుగా ఈ టీజర్ ను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

రేపు జూన్ 4న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా… మంచు విష్ణు నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement