Thursday, April 18, 2024

అరియానాతో ఆర్జీవి….ఫొటోస్ మాములుగా లేవు!!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకానొక సమయంలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వర్మ ఇటీవల కాలంలో ఆ స్థాయిలో ఒక సినిమాని కూడా తీయలేకపోయారు. అయితే నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వర్మ తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అరియానా తో కలసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేస్తున్నాడు.

అయితే ముందుగా హర్యానా ముఖం చూపించకుండా ఎవరో చెప్పుకోండి చూద్దాం అని కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఆతర్వాత కొంతమంది అరియానా అని గుర్తుపట్టారు. ఆ తర్వాత ఆమె అరియానా అంటూ మరి కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. నన్ను అరియానా చేసిన ఇంటర్వ్యూ. అరియానా టాక్ బోల్డ్ విత్ ఆర్జీవి.. పేరుతో శుక్రవారం విడుదల కానుంది అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement