Friday, March 29, 2024

ప్రగ్యా కు పోకిరి సినిమాను చూపించిన బెగ్గర్స్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా చూసే ఉంటారు. అయితే ఆ సినిమాలో బ్రహ్మానందంపై పగబట్టిన కొంతమంది బెగ్గర్స్ బ్రహ్మానందం ని ఫాలో అవుతూ అందినకాడికి అందినంత దోచుకుంటూ ఉంటారు.కాగా తాజాగా బాలకృష్ణ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు అదే అనుభవం ఎదురు అయింది. జిమ్ కి వెళ్దామని ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమెను కొంతమంది చుట్టుముట్టారట.

దీంతో ఆమె కూడా ఎంతో ఇబ్బంది పడిందట. మెల్లగా అక్కడి నుంచి తప్పించుకొని కారు ఎక్కినప్పటికీ ఆ తరువాత కొంత డబ్బులు తీసి వారి చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు మరికొన్ని చిత్రాల్లో కూడా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement